లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 7: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 23:19

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

యోహాను 17:17

సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.

తీతుకు 1:2

నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో

1రాజులు 8:15

నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.