అపోస్తలులకార్యములు 23: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీయొద్దకు తీసికొనిరమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి. "
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.
అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.
వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.
తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా,
ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
గనుక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను.
సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?