లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 23: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొని యున్నారు; ఇప్పడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 31:32

అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

మార్కు 8:23

ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,

మార్కు 9:27

అయితే యేసు వాని చెయ్యిపట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

నెహెమ్యా 2:4

అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

ఎస్తేరు 5:3

రాజు రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదనని ఆమెతో చెప్పగా

ఎస్తేరు 7:2

రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.

ఎస్తేరు 9:12

రాజు రాణియైన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామాను యొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్రహింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా

మార్కు 10:51

యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను.

న్యాయాధిపతులు 3:19

గిల్గాలు దగ్గర నున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.

2రాజులు 9:6

అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.