అపోస్తలులకార్యములు 23: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకతడు నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభయొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి.
మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయులచేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని.
కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.
ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.
ఈ హేతువుచేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని,
అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా, చెప్పుమనెను.
గిల్గాలు దగ్గర నున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.
అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.