ద్వితియోపదేశాకాండము 1: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగివచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
మోషే యెహోవా మాటవిని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు
జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;
ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;
ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండయెక్కి ఆ దేశము ఎట్టిదో
దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా