ద్వితియోపదేశాకాండము 1: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులును గల గొప్ప జనమేది?
మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;
అది అతనియొద్ద ఉండవలెను.
మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దానినప్పగించి
మరల వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను.
మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.
తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.
మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.
యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటిలోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు