లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 10: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు యెహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనునట్లు నీవు లేచి వారిముందర సాగుమని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 32:34

కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.

నిర్గమకాండము 33:1

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తు దేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.

సంఖ్యాకాండము 33:2

మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.