లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 24: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 15:8

నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.

నిర్గమకాండము 22:26

నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము.

నెహెమ్యా 5:7

అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

యోబు 22:6

ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి

యోబు 24:3

తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

యెహెజ్కేలు 33:15

కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.