లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 27: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీకాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 11:29

కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.

ద్వితియోపదేశాకాండము 11:30

అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.

యెహోషువ 8:30

మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము

యెహోషువ 8:31

యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

యెహోషువ 8:32

మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

యెహోషువ 8:33

అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ

ద్వితియోపదేశాకాండము 27:13

రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.