లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 6: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానక యున్నయెడల వాని గతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 3:10

అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని?

యోబు 3:11

గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని?

యోబు 3:12

మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని?

యోబు 3:13

లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును

యోబు 14:1

స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.

కీర్తనలు 58:8

వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.

కీర్తనలు 90:7

నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

కీర్తనలు 90:8

మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.

కీర్తనలు 90:9

నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము.