లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 21: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 21:19

తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికివెళ్లి తిరుగుచుండినయెడల, వాని కొట్టినవానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.

నిర్గమకాండము 21:20

ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.

నిర్గమకాండము 21:24

కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,

యోబు 31:13

నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల