లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 21: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినయెడల"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 15:16

అయితే నీయొద్ద వానికి మేలుకలిగినందున నిన్నును నీ యింటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీయొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల

ద్వితియోపదేశాకాండము 15:17

నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.

యెషయా 26:13

యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము

2కొరిందీయులకు 5:14

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

2కొరిందీయులకు 5:15

జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.