లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 35: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 31:5

ఆ యాజ్ఞ వెల్లడియగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొనివచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

సామెతలు 3:9

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.