నిర్గమకాండము 35: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరియొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,
ప్రదీపమునకు తైలము,
అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యధూపమునకును సుగంధ సంభారములు,
ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను.
మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.
నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యునియొద్ద దాని తీసికొనవలెను.
మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,
నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,
ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,
లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.
మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి.
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,