లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 35: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 25:5

ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

నిర్గమకాండము 28:9

మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున

నిర్గమకాండము 28:17

దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;

నిర్గమకాండము 28:18

పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది;

నిర్గమకాండము 28:19

గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది;

నిర్గమకాండము 28:20

రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.

నిర్గమకాండము 28:21

ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరుచొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.

నిర్గమకాండము 39:6

మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.

నిర్గమకాండము 39:7

అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

నిర్గమకాండము 39:8

మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకమును చేసెను.

నిర్గమకాండము 39:9

అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది.

నిర్గమకాండము 39:10

వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;

నిర్గమకాండము 39:11

పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది;

నిర్గమకాండము 39:12

గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది;

నిర్గమకాండము 39:13

రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను.

నిర్గమకాండము 39:14

ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్లచొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్లచొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.

నిర్గమకాండము 35:27

ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను