లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 8: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 34:10

ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని

ద్వితియోపదేశాకాండము 34:11

అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో

ద్వితియోపదేశాకాండము 34:12

వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులయెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.

నిర్గమకాండము 8:9

అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీమీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని అతడు ఫరోను అడుగగా అతడు రేపే అనెను

1రాజులు 13:6

అప్పుడు రాజు నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.