లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 8: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 8:5

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా

నిర్గమకాండము 8:17

అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను

నిర్గమకాండము 7:19

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువులమీదను, వారి నీటి గుంటలన్నిటిమీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.

నిర్గమకాండము 9:8

కాగా యెహోవా మీరు మీ పిడికిళ్లనిండ ఆవపుబుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.

నిర్గమకాండము 9:22

యెహోవా నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తు దేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.

కీర్తనలు 105:31

ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.