నిర్గమకాండము 8: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు నా ప్రజలను పోనియ్యనియెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.
ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టివాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుటనుండి బయలువెళ్లెను.