నిర్గమకాండము 8: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు నా ప్రజలను పోనియ్యనియెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.
జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.
అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.
రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడజేయువాడు.
ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.