నిర్గమకాండము 9: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యకపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు
కాగా యెహోవా మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయులయెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారియెదుట కలుగజేసిన సూచక క్రియలను
అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.
మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కు నంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతము చేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.