నిర్గమకాండము 9: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువుమీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను.
వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.
మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.
భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.
అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.