నిర్గమకాండము 9: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
అయితే ఫరో ఆ సమయమునకూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.
ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి
అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వమునతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను.
కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును.