యెహెజ్కేలు 48: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా
వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము.
ఇరువది యయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.