లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 48: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 22:26

దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

యెహెజ్కేలు 42:20

నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడియుండెను.

యెహెజ్కేలు 44:23

ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

యెహెజ్కేలు 45:6

మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.

యెహెజ్కేలు 45:1

మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.

యెహెజ్కేలు 48:9

యెహోవాకు మీరు ప్రతిష్టించు ప్రదేశము ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునై యుండవలెను.

యెహెజ్కేలు 48:10

ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.

యెహెజ్కేలు 42:15

అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.

యెహెజ్కేలు 48:13

యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పదివేల కొలకఱ్ఱలును ఉండును.

యెహెజ్కేలు 48:14

అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు.

యెహెజ్కేలు 48:30

పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.

యెహెజ్కేలు 48:17

పట్టణమునకు చేరిన ఖాళీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటి తట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను.

యెహెజ్కేలు 48:18

ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొలకఱ్ఱలును ఉండును.

యెహెజ్కేలు 48:19

ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.

1తిమోతి 3:15

అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది

జెకర్యా 2:2

నీవెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నాననెను.

ప్రకటన 21:10

ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.