యెహెజ్కేలు 48: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పదివేల కొలకఱ్ఱలును ఉండును. "
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు
ఆ పొలము సునాద సంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు.