ఆదికాండము 23: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని ఊరి గవిని ప్రవేశించువారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవినియొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు
అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయ పత్రములో చేవ్రాలు చేసిన సాక్షులయెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నులయెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.
అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండియుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా
అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను
హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవినిద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.