లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 25: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 23:16

అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగువందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.

ఆదికాండము 49:31

అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.

ఆదికాండము 23:3

తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి

ఆదికాండము 23:19

ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.