లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 25: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 12:2

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

ఆదికాండము 17:19

దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానము కొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.

ఆదికాండము 22:17

నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

ఆదికాండము 50:24

యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొనిపోవునని చెప్పెను

ఆదికాండము 16:14

అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్యనున్నది.

ఆదికాండము 24:62

ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.

ఆదికాండము 24:35

యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.

ఆదికాండము 26:1

అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.