ఆదికాండము 25: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;
యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,
మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.