లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 27: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 21:2

దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

1సమూయేలు 21:13

కాబట్టి దావీదు వారియెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.

1సమూయేలు 27:10

ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.

2సమూయేలు 14:5

రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

యోబు 13:7

దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

యోబు 13:8

ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా?

యోబు 15:5

నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

సామెతలు 12:19

నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

సామెతలు 12:22

అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.

సామెతలు 30:8

వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

జెకర్యా 8:16

మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.

రోమీయులకు 3:7

దేవునికి మహిమకలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?

రోమీయులకు 3:8

మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

ఎఫెసీయులకు 4:25

మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

కొలొస్సయులకు 3:9

ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ

ఆదికాండము 27:19

అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను

గలతీయులకు 2:13

తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.