లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 31: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 2:24

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఆదికాండము 29:24

మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

ఆదికాండము 29:29

మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

2కొరిందీయులకు 12:14

ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా

ఎఫెసీయులకు 6:4

తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.