లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 31: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 24:28

అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటివారికి తెలిపెను.

ఆదికాండము 24:67

ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

ఆదికాండము 18:9

వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.