లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 31: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 24:10

అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొనిపోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి

ఆదికాండము 24:61

రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడివెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొనిపోయెను.

1సమూయేలు 30:17

దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

ఆదికాండము 31:34

రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు.

ఆదికాండము 45:19

నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.

ఆదికాండము 46:5

యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.