లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 33: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును, అతనితో నాలుగువందల మంది మనుష్యులును వచ్చుచుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 27:41

తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రినిగూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

ఆదికాండము 27:42

రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు.

ఆదికాండము 32:6

ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగివచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా

ఆదికాండము 32:7

యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి

ఆదికాండము 32:16

తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

ఆదికాండము 32:8

ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను

ఆదికాండము 38:1

ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను.

ఆదికాండము 42:4

అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.

యెహోషువ 5:13

యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తిచేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లినీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా