లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 33: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఏశావు నీకిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీయొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 34:11

మరియు షెకెము మీ కటాక్షము నామీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.

ఆదికాండము 47:25

వారు నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మామీద నుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.

1సమూయేలు 25:8

నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివిు గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.

2సమూయేలు 16:4

అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.

ఆదికాండము 30:27

అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

ఆదికాండము 32:5

నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.

1సమూయేలు 1:18

ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.