ఆదికాండము 33: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో
ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నాయెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నాయెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి
మోషే యెహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొనిపొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.
కాబట్టి నీ కటాక్షము నాయెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతినొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.
యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
అయితే నీవు ఒకపని చేయవలెను; దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నాయొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.
అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.
అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు రాజదర్శనము చేయక యుండగా
అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.
వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.
ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచుకొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా
అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను
యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతనియొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతికప్పగించెను.
వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొనిపోవుడి.
ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.