ఆదికాండము 36: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీబామా పుత్రసంతానపు నాయకులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.
ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు.
ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.