ఆదికాండము 37: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోసేపు తన సహోదరులయొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.
వారు యోసేపు అంగీని తీసికొని, ఒకమేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి
ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి
అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్టమృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.
అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరునియెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి
నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.
వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.