లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 44: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి నా తండ్రియైన తమ దాసునియొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:29

వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి.

ఆదికాండము 42:30

ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.

ఆదికాండము 42:31

అప్పుడు మేము యథార్థ వంతులము, వేగులవారము కాము.

ఆదికాండము 42:32

పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.

ఆదికాండము 42:33

అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి

ఆదికాండము 42:34

నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.