లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 17: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయుల కును షెకెమీయులకును హెపెరీయులకును షెమీ దీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 26:29

మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదు పుత్రులు.

సంఖ్యాకాండము 26:30

ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:31

అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:32

షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

న్యాయాధిపతులు 6:11

యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

న్యాయాధిపతులు 8:2

అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.

1దినవృత్తాంతములు 7:18

మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.

సంఖ్యాకాండము 26:30

ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:31

అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:32

షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

సంఖ్యాకాండము 36:1

యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి

యెహోషువ 17:5

కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.

న్యాయాధిపతులు 6:34

యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతనియొద్దకు వచ్చిరి.

1రాజులు 4:10

అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.