లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 17: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్ట లేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 26:33

హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.

సంఖ్యాకాండము 27:1

అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.

సంఖ్యాకాండము 36:2

ఆ దేశమును వంతుచీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవానికాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.

సంఖ్యాకాండము 36:3

అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారినెవరినైనను పెండ్లి చేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతుచీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.

సంఖ్యాకాండము 36:4

కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా

సంఖ్యాకాండము 36:5

మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.

సంఖ్యాకాండము 36:6

యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.

సంఖ్యాకాండము 36:7

ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.

సంఖ్యాకాండము 36:8

మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.

సంఖ్యాకాండము 36:9

స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.

సంఖ్యాకాండము 36:10

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.

సంఖ్యాకాండము 36:11

సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసికొనిరి.

సంఖ్యాకాండము 36:1

యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి

యెహోషువ 17:5

కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.