లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 17: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 14:1

ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.

సంఖ్యాకాండము 34:17

ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.

సంఖ్యాకాండము 34:18

మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.

సంఖ్యాకాండము 34:19

వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.

సంఖ్యాకాండము 34:20

షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,

సంఖ్యాకాండము 34:21

బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.

సంఖ్యాకాండము 34:22

దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,

సంఖ్యాకాండము 34:23

యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,

సంఖ్యాకాండము 34:24

ఎఫ్రాయిమీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,

సంఖ్యాకాండము 34:25

జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,

సంఖ్యాకాండము 34:26

ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,

సంఖ్యాకాండము 34:27

ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.

సంఖ్యాకాండము 34:28

నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.

సంఖ్యాకాండము 34:29

కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.

సంఖ్యాకాండము 27:6

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.

సంఖ్యాకాండము 27:7

నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

గలతీయులకు 3:28

ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

సంఖ్యాకాండము 27:4

అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంతమాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి.

యెహోషువ 21:1

లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్ద కును, నూను కుమారుడైన యెహోషువయొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి