లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 20: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 8:14

హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.

యెహోషువ 8:15

యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

యెహోషువ 8:16

వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

న్యాయాధిపతులు 19:13

మరియు అతడునీవు రమ్ము,ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.

న్యాయాధిపతులు 19:14

అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.

యెషయా 10:29

వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.

యెహోషువ 7:5

అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.

యెహోషువ 8:5

నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

యెహోషువ 8:16

వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

న్యాయాధిపతులు 20:39

ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులువీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.