లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 20: 46

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 20:15

ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.

న్యాయాధిపతులు 20:35

అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.

న్యాయాధిపతులు 8:10

అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.

1సమూయేలు 9:21

అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.