న్యాయాధిపతులు 20: 42
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందకపోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్ల దాని కలిసికొందురు. నియామకకూటములకు ఎవరును రారుగనుక
గిబియాలో చెడుకార్యములు జరిగిననాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.
ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా
యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధపంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను.
తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడియుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు