లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 20: 43

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 8:20

హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.

యెహోషువ 8:21

పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.

యెహోషువ 8:22

తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.

2సమూయేలు 10:9

యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధపంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను.

2రాజులు 7:17

ఎవని చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.

1దినవృత్తాంతములు 19:10

తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడియుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,