లూకా 19: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?
సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును.
ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లనిచోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును
కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా
ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు