లేఖనాలను అన్వేషించండి

లూకా 19: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడిచెట్టెక్కెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 9:7

చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటినిగూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

లూకా 9:8

కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

లూకా 9:9

అప్పుడు హేరోదు నేను యోహానును తలగొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

లూకా 23:8

హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను.

యోహాను 12:21

వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా

లూకా 12:25

మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొనగలడు?

మత్తయి 18:17

అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

మార్కు 5:24

ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.

అపోస్తలులకార్యములు 24:24

కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.