లూకా 5: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
అందుకందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితోనొకడు చెప్పుకొనిరి.
నీచేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు.
సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటిని వాని పాదములక్రింద నీవు ఉంచియున్నావు.
వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.
నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి
ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొనిపోవుదుననుకొని, మందసమును
నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు
నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
గొఱ్ఱల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.