లేఖనాలను అన్వేషించండి

లూకా 5: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 6:12

ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

మత్తయి 14:23

ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.

మార్కు 1:35

ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.

మార్కు 1:36

సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి

మార్కు 6:46

ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లెను.

యోహాను 6:15

రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

హోషేయ 5:6

వారు గొఱ్ఱలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.